వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా గురువారం మంచిర్యాల పట్టణంలోని వైశ్య భవన్‌లో రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో, కరీంనగర్ ప్రతిమ ఫౌండేషన్ సహకారంతో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ప్రారంభించారు. ప్రతిమ ఆసుపత్రికి చెందిన వైద్యులతో పాటు మంచిర్యాలలోని పలువురు ప్రముఖ వైద్య నిపుణులు శిబిరానికి హాజరై ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా 2,000 మందికి పైగా ప్రజలకు వైద్య సేవలు అందించడంతో పాటు అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.అవసరం ఉన్న వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో 2డీ ఎకో, చెస్ట్ ఎక్స్‌రే, మామోగ్రామ్, ఈసీజీ, షుగర్ తదితర పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. ముఖ్యంగా మహిళలకు రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించేందుకు మామోగ్రామ్ పరీక్షలు అందుబాటులో ఉంచడం ద్వారా శిబిరం ద్వారా వివిధ ఆరోగ్య సమస్యలపై పరీక్షలు నిర్వహించే అవకాశం కల్పించారు.ఈ సందర్భంగా రఘునాథ్ వెరబెల్లి మాట్లాడుతూ పేద ప్రజలు వైద్య ఖర్చుల కారణంగా ఇబ్బందులు పడకుండా అవసరమైన వైద్య పరీక్షలు, చికిత్స, మందులను ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో ఇలాంటి శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు, వ్యాధులను ముందుగానే గుర్తించి తగిన వైద్య సేవలు పొందేలా ప్రోత్సహించడం కూడా శిబిరాల ప్రధాన ఉద్దేశమన్నారు.కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, గాజుల ముఖేష్ గౌడ్, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, ఎనగందుల కృష్ణమూర్తి, కార్పొరేటర్లు కస్తూరి నాగరాజు, బొట్ల అనిత, పట్టి వెంకట కృష్ణ, జోగుల శ్రీదేవి, మోటపలుకుల తిరుపతి, బియ్యాల సతీష్ రావు, అమిరిశెట్టి రాజ్ కుమార్, రంగ శ్రీశైలం, కుర్రె చక్రవర్తి, గడ్డం స్వామిరెడ్డి, రమణరావు, ప్రేమ్ సింగ్, పచ్చ స్వప్న రాణి, గోపతి రాజయ్య, కర్రె లచ్చన్న తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం