Saturday, 12 September 2026 09:06:46 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన ఎమ్మెల్యే

Date : 28 June 2026 03:26 PM Views : 178

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల: పోలియో మహమ్మారిని పూర్తిగా నిర్మూలించాలంటే ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆదివారం మాతా శిశు సంక్షేమ ఆసుపత్రిలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆయన చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పోలియో నివారణలో పల్స్ పోలియో కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను సమీపంలోని పోలియో బూత్‌లకు తీసుకువచ్చి చుక్కలు వేయించాలని, ఒక్క చిన్నారి కూడా ఈ కార్యక్రమానికి దూరం కాకుండా అధికారులు, వైద్య సిబ్బంది విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ లక్ష్యం పోలియో రహిత సమాజ నిర్మాణమేనని, అందరి సహకారంతోనే అది సాధ్యమవుతుందన్నారు.జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాల్లో ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్యులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

BEERAM SHARATH CHANDHRA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: