వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : ధర్మ జాగరణ విభాగం, గ్రామ దేవాలయ అర్చక పరిషత్ - తెలంగాణ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని ఆలయాల్లో నిత్య పూజలు నిర్వహించేందుకు వీలుగా యువతకు అర్చక శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది.ఈ మేరకు మంచిర్యాల జిల్లా మందమర్రిలోని శ్రీ హరిహర దేవస్థానం (అయ్యప్ప దేవాలయం)లో సెప్టెంబర్ 27,2026 నుండి అక్టోబర్ 03, 2026 వరకు 7 రోజుల పాటు నిర్వహించనున్న ఈ శిక్షణా శిబిరానికి సంబంధించి, సంఘం ప్రతినిధులు ఆలయ కమిటీ వారిని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించారు. శిక్షణకు విచ్చేసే శిక్షార్థులకు అవసరమైన ప్రాథమిక వసతులు, భోజన వసతి,మరియు ప్రాంగణ సదుపాయాలు కల్పించడంలో ఆలయ కమిటీ పూర్తి బాధ్యత వహించి,ఈ ధార్మిక కార్యక్రమాన్ని ముందుండి విజయవంతంగా నడిపించాలని సంఘ సభ్యులు విజ్ఞప్తి చేశారు.గ్రామీణ దేవాలయాల పరిరక్షణ మరియు ధర్మ ప్రచారంలో భాగంగా చేపట్టిన ఈ సత్కార్యానికి ఆలయ కమిటీ సభ్యులు సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ దేవాలయ అర్చక పరిషత్ బాధ్యులు, ధర్మ జాగరణ విభాగ ప్రతినిధులు మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం