వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల గోదావరి తీరంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న పుష్కరఘాట్ అభివృద్ధి పనులకు సోమవారం భూమిపూజ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పాల్గొని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.గోదావరి తీరాన్ని ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయడంతో పాటు భక్తులు, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో పుష్కరఘాట్ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో డీసీపీ భాస్కర్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్, మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కార్పొరేటర్ తూముల నరేష్, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం