వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ మండలం పాడిబండ గ్రామపంచాయతీ పరిధిలోని వట్టివాగు కాలనీలో దిశా మోడల్ పాఠశాల ఆవరణంలో పోషణ మాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో చిర్రకుంట ఐటీడీఏ సూపర్‌వైజర్‌తో పాటు అంగన్‌వాడీ కార్యకర్తలు,వట్టివాగు గ్రామానికి చెందిన గర్భిణీలు,బాలింతలు,ఆశావర్కర్లు,వైద్యసిబ్బంది పాల్గొన్నారు.గ్రామపంచాయతీ సర్పంచ్ ఆత్రం ఈశ్వరీబాయి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే ఎస్పీ ఆర్డీవోల్ రాథోడ్ రవీందర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం ప్రాముఖ్యత, ఆరోగ్య పరిరక్షణ, సమతుల్య ఆహారం తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
Reporter
వాస్తవ గమ్యం