Sunday, 13 September 2026 07:38:50 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

టీపీసీసీ ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా చందనగిరి శ్రీనివాస్..

నియామక పత్రం అందజేసిన మంత్రి వివేక్

Date : 06 June 2026 05:46 PM Views : 96

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : చెన్నూరు నియోజకవర్గంలోని క్యాతనపల్లి మున్సిపాలిటీకి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చందనగిరి శ్రీనివాస్‌కు రాష్ట్ర స్థాయిలో కీలక పదవి దక్కింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా ఆయన నియమితులయ్యారు. ఈ మేరకు టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.హైదరాబాద్‌లో చెన్నూరు ఎమ్మెల్యే, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా చందనగిరి శ్రీనివాస్ తన నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌కు మంత్రి వివేక్ ప్రత్యేక అభినందనలు తెలిపి, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.చందనగిరి శ్రీనివాస్ తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ అధిష్ఠానానికి, మంత్రి వివేక్ వెంకటస్వామికి, ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు శ్రీనివాస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విస్తరణకు, ఎస్సీ వర్గాల అభ్యున్నతికి, సామాజిక న్యాయం కోసం అంకితభావంతో పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు. శ్రీనివాస్‌కు రాష్ట్ర స్థాయి పదవి దక్కడం పట్ల క్యాతనపల్లి, చెన్నూరు పరిధిలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :