వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : నస్పూర్ గేటు వద్ద 63వ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఐదుగురు మహిళల కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని తెలంగాణ రక్షణ సేన, హెచ్‌ఎంఎస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు.ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చింతకుంట లక్ష్మి, అగ్గు సౌందర్య, తోటపల్లి సోనియా, తొగరి సుమలత, రామ్ టైంకి దివ్యవాణి కుటుంబాలకు నాయకులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నరమళ్ళ లక్ష్మి, సల్లూరి అనూషలకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్న తెలంగాణ తల్లి విగ్రహం, నస్పూర్ గేటు ప్రాంతాలను 'యాక్సిడెంట్ జోన్లు'గా గుర్తించి, అక్కడ సిగ్నల్ వ్యవస్థతో పాటు ట్రాఫిక్ సిబ్బందిని నియమించాలని పెద్దపల్లి పార్లమెంట్ ఇంచార్జ్, హెచ్‌ఎంఎస్ ప్రెసిడెంట్ తిప్పారపు సారయ్య, శ్రీరాంపూర్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ అనిల్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Admin
వాస్తవ గమ్యం