Monday, 26 October 2026 02:46:10 PM
# కలెక్టరేట్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు # గుండి బ్రిడ్జిసమస్య పరిష్కారం కోసం యువత సైకిల్ యాత్ర ప్రారంభం # గుండి బ్రిడ్జి సాధనకై యువత సైకిల్ యాత్ర 20 ఏళ్ల సమస్య పరిష్కారమే లక్ష్యం # ఈ నెల 26న జిల్లాలో విద్యాసంస్థలకు స్థానిక సెలవు రెసిడెన్షియల్ పాఠశాలలకు మినహాయింపు # ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను బేషరతుగా రద్దు చేయాలి # జాఫర్‌నగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి # సెంట్రల్ లైబ్రరీలో కొమురం భీం జయంతి వేడుకలు # మంచిర్యాలలో శాంతిభద్రతలను పరిరక్షించాలి # రాళ్లవాగు బ్రిడ్జి పనులతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలి # విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఘన నివాళి # రావణ దహనానికి పటిష్ఠ పోలీసు బందోబస్తు # కిష్టంపేట గ్రామంలో భక్తిశ్రద్ధలతో మహా చండీ హోమం నిర్వహణ # ప్రమాదవశాత్తు బావిలో పడిన యువ రైతు మృతి. # భీమారం శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండీ హోమం # సద్దుల బతుకమ్మ సంబరాల్లో విషాదం.. యువతి మృతి # రామలీల కార్యక్రమానికి మంత్రి వివేక్‌కు ఆహ్వానం # ఆదిల్పేట్‌లో ఘనంగా బాల్క సుమన్ పుట్టినరోజు వేడుకలు # గిరిజన పోరాట యోధుల జయంతి ఉత్సవాలకు ఆహ్వానం # ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీ పనుల పరిశీలన # బతుకమ్మ పూలతో కళకళలాడిన ఆసిఫాబాద్ మార్కెట్

సాయిరాం యూత్ దుర్గా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా కుంకుమ పూజ

Date : 16 October 2026 12:29 PM Views : 105

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : భీమారం మండలంలోని రావీ చెట్టు వాడలో సాయిరాం యూత్ దుర్గ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గా శరన్న వరాత్రోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజు శుక్రవారం అమ్మవారు శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా చిన్నారుల భవిష్యత్తుకు విద్యాబుద్ధులు కలగాలని ఆకాంక్షిస్తూ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని, మహిళల భాగస్వామ్యంతో కుంకుమ పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అక్షరాభ్యాస కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు అక్షరాలు దిద్దించి, విద్యాభ్యాసానికి శుభారంభం చేశారు. అనంతరం నిర్వాహకులు చిన్నారులకు పలకలు, నోట్‌బుక్కులు అందజేశారు.అమ్మవారి ఆశీస్సులు ప్రజలం దరిపై ఎల్లప్పుడూ ఉండాలని, భీమారం మండల ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, పాడిపంటలతో గ్రామాలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సాయిరాం యూత్ దుర్గ ఉత్సవ సమితి సభ్యులు తెలిపారు.ఈ ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని సమితి సభ్యులు కోరారు.

MANTHRI GAJANAND

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: