Tuesday, 27 October 2026 06:43:53 PM
# రాజంపేట అభివృద్ధికి ప్రత్యేక నిధులు,సిబ్బందిని కేటాయించాలి # కలెక్టరేట్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు # గుండి బ్రిడ్జిసమస్య పరిష్కారం కోసం యువత సైకిల్ యాత్ర ప్రారంభం # గుండి బ్రిడ్జి సాధనకై యువత సైకిల్ యాత్ర 20 ఏళ్ల సమస్య పరిష్కారమే లక్ష్యం # ఈ నెల 26న జిల్లాలో విద్యాసంస్థలకు స్థానిక సెలవు రెసిడెన్షియల్ పాఠశాలలకు మినహాయింపు # ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను బేషరతుగా రద్దు చేయాలి # జాఫర్‌నగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి # సెంట్రల్ లైబ్రరీలో కొమురం భీం జయంతి వేడుకలు # మంచిర్యాలలో శాంతిభద్రతలను పరిరక్షించాలి # రాళ్లవాగు బ్రిడ్జి పనులతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలి # విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఘన నివాళి # రావణ దహనానికి పటిష్ఠ పోలీసు బందోబస్తు # కిష్టంపేట గ్రామంలో భక్తిశ్రద్ధలతో మహా చండీ హోమం నిర్వహణ # ప్రమాదవశాత్తు బావిలో పడిన యువ రైతు మృతి. # భీమారం శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండీ హోమం # సద్దుల బతుకమ్మ సంబరాల్లో విషాదం.. యువతి మృతి # రామలీల కార్యక్రమానికి మంత్రి వివేక్‌కు ఆహ్వానం # ఆదిల్పేట్‌లో ఘనంగా బాల్క సుమన్ పుట్టినరోజు వేడుకలు # గిరిజన పోరాట యోధుల జయంతి ఉత్సవాలకు ఆహ్వానం # ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీ పనుల పరిశీలన

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పసికందుల మృతి – బాధిత కుటుంబాలను వెంటనే ఆదుకోవాలి

రిమ్స్‌లో జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరపాలి..

Date : 23 September 2026 11:34 AM Views : 135

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : రిమ్స్‌లో జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పూర్క చిత్రు, మండల అధ్యక్షులు మడవి కోసేరావ్ డిమాండ్.ఆదిలాబాద్ రిమ్స్‌లోని ఎస్ ఎన్ సియూలో ఏసీ సంబంధిత ప్రమాదంలో ముగ్గురు పసికందులు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరం. ఈ ఘటనలో మృతి చెందిన చిన్నారుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ డిమాండ్ చేస్తోంది.ఇంద్రవెల్లి మండలం గిన్నెరా గ్రామానికి చెందిన కుంరం సేకుబాయి–దినేష్ దంపతుల బిడ్డతో పాటు ఉట్నూర్ ఇచ్చోడ ప్రాంతానికి చెందిన చిన్నారులు మృతి చెందినట్లు సమాచారం.ఈ ఘటనకు షార్ట్ సర్క్యూట్ కారణమని చెబుతూ, విచారణ జరుపుతున్నామని అధికారులు మరియు ప్రభుత్వం పేర్కొంటున్నారు. అయితే ఇలాంటి ప్రమాదాలు జరగకముందే ఆసుపత్రుల్లో భద్రతా ప్రమాణాలను పర్యవేక్షించి, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.ఏజెన్సీ ప్రాంతాల్లో గర్భిణులు, చిన్నారులు, సాధారణ ప్రజలు వైద్య సేవల కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో కూడా వైద్య సదుపాయాల కొరతపై ప్రజలు ఆసుపత్రుల ముందు ధర్నాలు, నిరసనలు నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రజల్లో ఆందోళన ఉంది. ఏజెన్సీ ప్రాంతానికి ప్రధాన వైద్య కేంద్రంగా ఉన్న ఉట్నూర్ ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో వైద్యులు, సిబ్బంది, అవసరమైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. చిన్నచిన్న వైద్య సమస్యలకు కూడా రోగులను ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించాల్సిన పరిస్థితి లేకుండా ఉట్నూర్‌లోనే మెరుగైన వైద్య సేవలు అందించాలి. ఆసుపత్రులు ప్రజల ప్రాణాలను కాపాడే కేంద్రాలుగా ఉండాలి కానీ, భద్రతా లోపాల కారణంగా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రావడం అత్యంత బాధాకరం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో విద్యుత్, ఏసీ, అగ్నిమాపక, అత్యవసర భద్రతా వ్యవస్థలను ఎప్పటి కప్పుడు తనిఖీ చేసి,లోపాలు ఉంటే వెంటనే సరిచేయాలి. రిమ్స్‌లో జరిగిన పసికందుల మృతి ఘటనపై సమగ్ర, పారదర్శక విచారణ జరిపి వాస్తవ కారణాలను వెల్లడించాలి. బాధ్యులుగా తేలిన వారిపై తగిన చర్యలు తీసుకోవడంతో పాటు, మృతి చెందిన పసికందుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం అందించి, వారికి అండగా నిలవాలి. ఇకపై ఇలాంటి విషాద ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో భద్రతా ప్రమాణాలను కఠినంగా అమలు చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.

Kumram jangu

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: