Tuesday, 27 October 2026 05:30:41 PM
# రాజంపేట అభివృద్ధికి ప్రత్యేక నిధులు,సిబ్బందిని కేటాయించాలి # కలెక్టరేట్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు # గుండి బ్రిడ్జిసమస్య పరిష్కారం కోసం యువత సైకిల్ యాత్ర ప్రారంభం # గుండి బ్రిడ్జి సాధనకై యువత సైకిల్ యాత్ర 20 ఏళ్ల సమస్య పరిష్కారమే లక్ష్యం # ఈ నెల 26న జిల్లాలో విద్యాసంస్థలకు స్థానిక సెలవు రెసిడెన్షియల్ పాఠశాలలకు మినహాయింపు # ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను బేషరతుగా రద్దు చేయాలి # జాఫర్‌నగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి # సెంట్రల్ లైబ్రరీలో కొమురం భీం జయంతి వేడుకలు # మంచిర్యాలలో శాంతిభద్రతలను పరిరక్షించాలి # రాళ్లవాగు బ్రిడ్జి పనులతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలి # విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఘన నివాళి # రావణ దహనానికి పటిష్ఠ పోలీసు బందోబస్తు # కిష్టంపేట గ్రామంలో భక్తిశ్రద్ధలతో మహా చండీ హోమం నిర్వహణ # ప్రమాదవశాత్తు బావిలో పడిన యువ రైతు మృతి. # భీమారం శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండీ హోమం # సద్దుల బతుకమ్మ సంబరాల్లో విషాదం.. యువతి మృతి # రామలీల కార్యక్రమానికి మంత్రి వివేక్‌కు ఆహ్వానం # ఆదిల్పేట్‌లో ఘనంగా బాల్క సుమన్ పుట్టినరోజు వేడుకలు # గిరిజన పోరాట యోధుల జయంతి ఉత్సవాలకు ఆహ్వానం # ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీ పనుల పరిశీలన

హరిహర దేవస్థానంలో ఘనంగా గణపతి నవరాత్రుల అన్నదాన.

పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు

Date : 22 September 2026 05:25 PM Views : 236

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : స్థానిక హరిహర దేవస్థానంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని భక్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి అన్నదాన మహా కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది.ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు,జడ్పీటీసీ భాగ్యలక్ష్మి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ​ముందుగా స్వామివారిని దర్శించుకున్న ఓదెలు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం అన్నదాన వితరణ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా ప్రసాదాన్ని వడ్డించారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు నల్లాల ఓదెలు,భాగ్యలక్ష్మి దంపతులను శాలువాలతో ఘనంగా సన్మానించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ​ఆ తర్వాత,ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న కమిటీ సభ్యులను, విశేష పూజా కార్యక్రమాలలో పాల్గొన్న భక్త దంపతులను నల్లాల ఓదెలు దంపతులు శాలువాలతో సత్కరించి అభినందించారు.ఈ అన్నదాన మహోత్సవానికి పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు.భక్తుల సమక్షంలో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో విలసిల్లింది. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన దాతలకు, భక్తులకు మరియు స్వచ్ఛందంగా సేవలందించిన ప్రతి ఒక్కరికీ ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: