వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి కేకే ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్ట్ మేనేజర్‌గా సమర్థవంతమైన సేవలందించి, బదిలీపై ఆర్కే ఓసీకి వెళ్తున్న రామరాజుకు మరియు ఎస్సార్పీ ప్రాజెక్ట్ నుండి కేకే ఓసీకి నూతనంగా బదిలీపై వచ్చిన మేనేజర్ మధుసూదన్‌కు ఘనంగా సన్మానం జరిగింది. ఈ సందర్భంగా ప్రాజెక్ట్‌లోని మోటార్ వెహికల్ డ్రైవర్లు అధికారులను శాలువాలతో ఘనంగా సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు.కేకే ఓసీ ప్రాజెక్ట్‌లో రామరాజు అందించిన సేవలను,కార్మికులతో ఆయనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటూ వీడ్కోలు పలికారు. అలాగే నూతనంగా బాధ్యతలు స్వీకరిస్తున్న మేనేజర్ మధుసూదన్‌కు పుష్పగుచ్ఛం అందించి హృదయపూర్వక స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంవీ డ్రైవర్లు చెప్పాల రమేష్, కర్రే శ్రీనివాస్, దామోదర్ రెడ్డి, రాజేందర్, రవి, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం