Saturday, 12 September 2026 09:03:14 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

​మహేశ్వరంలో కలకలం 42 వేలకు పైగా రోహింగ్యాల దొంగ ఓట్లు బయటపెట్టిన బీజేపీ నేతలు!

Date : 06 July 2026 11:17 PM Views : 453

వాస్తవ గమ్యం / తెలంగాణ / హైద్రాబాద్ : తెలంగాణలోని మహేశ్వరం నియోజకవర్గంలో భారీ ఎత్తున అక్రమ ఓట్లు, రోహింగ్యా ముస్లింల ఓటర్ల నమోదు కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో, స్థానిక బీజేపీ నాయకులు సంచలన విషయాలను గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా వెల్లడించారు.మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి అందే శ్రీరాములు యాదవ్ తన బృందంతో కలిసి గత నెల రోజులుగా క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. కేవలం 65 పోలింగ్ బూత్‌లలోనే దాదాపు 42,616 అక్రమ మరియు దొంగ ఓట్లు ఉన్నట్లు వారు గుర్తించారు.ఈ దొంగ ఓట్ల వెనుక ఉన్న విస్తుపోయే నిజాలను శ్రీరాములు యాదవ్ మీడియాకు వివరించారు.ఒకే ఇంట్లో తండ్రి వయసు 41 ఏళ్లు ఉంటే, కూతురి వయసు 39 ఏళ్లుగా ఓటర్ల జాబితాలో నమోదైంనట్టు స్థానిక హిందువుల ఇళ్ల నెంబర్లపై రోహింగ్యాలు, బంగ్లాదేశీయుల పేర్లను ఓటర్లుగా చేర్చారు. అనేకమంది ఓటర్ల వివరాలలో తండ్రి పేరు స్థానంలో కేవలం 'సన్ ఆఫ్' అని మాత్రమే వదిలేశారు.స్థానిక నివాసితులు రోహింగ్యాల వల్ల పడుతున్న ఇబ్బందులను గ్రౌండ్ రిపోర్ట్‌లో పంచుకున్నారు. ఎలాంటి అధికారిక ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు లేకపోయినప్పటికీ, వీరికి ఉచిత నీటి కనెక్షన్లు, ఉచిత విద్యుత్, మొబైల్ ఫోన్లు, బైకులు మరియు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కూడా లభించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ​గత శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ అభ్యర్థి విజయం వెనుక ఈ దొంగ ఓట్ల ప్యాకేజీల హస్తం ఉందని, ఒక ఏజెంట్ ద్వారా దాదాపు కోటిన్నర రూపాయల డీల్ నడిచిందని బీజేపీ నేతలు ఆరోపించారు.పశ్చిమ బెంగాల్, అస్సాం, బీహార్ రాష్ట్రాల్లో అక్రమ ఓట్లను ఏ విధంగానైతే తొలగించారో, అదే విధంగా తెలంగాణలో కూడా తనిఖీలు జరిపి రోహింగ్యాల దొంగ ఓట్లను వెంటనే తొలగించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి నివేదికను ఇప్పటికే జిల్లా కలెక్టర్‌కు, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి (CEO) సమర్పించినట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

G ASHOK

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: