వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : బహిరంగ ప్రదేశాల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు శ్రీరాంపూర్ పోలీసులు డ్రోన్ సహాయంతో ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహించారు. ప్రగతి స్టేడియం పరిసర ప్రాంతం, అరుణక్కనగర్, హైవే ప్రాంతాల్లో డ్రోన్ ద్వారా విస్తృతంగా నిఘా చేపట్టారు.ఈ సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న ముగ్గురిని పోలీసులు గుర్తించారు. వారిపై మూడు ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేసినట్లు శ్రీరాంపూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆకుల అశోక్ తెలిపారు.బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం,అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.ప్రజల భద్రత కోసం డ్రోన్ నిఘాతో పాటు ప్రత్యేక పెట్రోలింగ్‌ను కొనసాగిస్తామని తెలిపారు.
Reporter
వాస్తవ గమ్యం