Monday, 26 October 2026 04:28:52 PM
# కలెక్టరేట్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు # గుండి బ్రిడ్జిసమస్య పరిష్కారం కోసం యువత సైకిల్ యాత్ర ప్రారంభం # గుండి బ్రిడ్జి సాధనకై యువత సైకిల్ యాత్ర 20 ఏళ్ల సమస్య పరిష్కారమే లక్ష్యం # ఈ నెల 26న జిల్లాలో విద్యాసంస్థలకు స్థానిక సెలవు రెసిడెన్షియల్ పాఠశాలలకు మినహాయింపు # ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను బేషరతుగా రద్దు చేయాలి # జాఫర్‌నగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి # సెంట్రల్ లైబ్రరీలో కొమురం భీం జయంతి వేడుకలు # మంచిర్యాలలో శాంతిభద్రతలను పరిరక్షించాలి # రాళ్లవాగు బ్రిడ్జి పనులతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలి # విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఘన నివాళి # రావణ దహనానికి పటిష్ఠ పోలీసు బందోబస్తు # కిష్టంపేట గ్రామంలో భక్తిశ్రద్ధలతో మహా చండీ హోమం నిర్వహణ # ప్రమాదవశాత్తు బావిలో పడిన యువ రైతు మృతి. # భీమారం శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండీ హోమం # సద్దుల బతుకమ్మ సంబరాల్లో విషాదం.. యువతి మృతి # రామలీల కార్యక్రమానికి మంత్రి వివేక్‌కు ఆహ్వానం # ఆదిల్పేట్‌లో ఘనంగా బాల్క సుమన్ పుట్టినరోజు వేడుకలు # గిరిజన పోరాట యోధుల జయంతి ఉత్సవాలకు ఆహ్వానం # ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీ పనుల పరిశీలన # బతుకమ్మ పూలతో కళకళలాడిన ఆసిఫాబాద్ మార్కెట్

వన్యప్రాణుల పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన

Date : 08 October 2026 08:25 PM Views : 79

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ జాతీయ వన్యప్రాణి వారోత్సవాల ముగింపు వేడుకలను గురువారం రెబ్బెన మండల కేంద్రంలోని ఫారెస్ట్‌ రేంజ్‌ కార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. అక్టోబర్‌ 2 నుంచి 8 వరకు నిర్వహించిన వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు అడవులు, వన్యప్రాణుల ప్రాధాన్యతపై అవగాహన కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా రెబ్బెన రేంజ్‌ అధికారి కే. రమాదేవి మాట్లాడుతూ అడవుల ప్రాముఖ్యత, వన్యప్రాణుల సంరక్షణపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు వివిధ పాఠశాలల విద్యార్థులకు ఉపన్యాసం, చిత్రలేఖనం తదితర పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. వన్యప్రాణులు, అడవుల సంరక్షణలో విద్యార్థులు కూడా భాగస్వాములు కావాలని అధికారులు సూచించారు. ప్రకృతి పరిరక్షణపై చిన్ననాటి నుంచే అవగాహన పెంపొందించడం ద్వారా భవిష్యత్‌ తరాలకు పర్యావరణాన్ని కాపాడగలమని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఎస్‌ ప్రిన్సిపాల్‌ చైతన్య, డిప్యూటీ ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి ఏ. చంద్రమోహన్‌, ఫారెస్ట్‌ సెక్షన్‌ అధికారులు పి. రవి, వి. సంతోష్‌ కుమార్‌, బీట్‌ అధికారులు కే. వెంకటేష్‌, డి. శ్రీనివాస్‌, డి. మహేష్‌, అస్మా యమన్‌ తదితరులు పాల్గొన్నారు.

KOLLI SUNIL KUMAR..

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :