వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని మంగీ గ్రామ పంచాయతీ పరిధిలోని పటేల్ గూడ గ్రామంలో నూతన రేకు షెడ్ నిర్మాణానికి సోమవారం ఘనంగా భూమి పూజ నిర్వహించారు.ఈ కార్యక్రమం ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో, మంగీ గ్రామ సర్పంచ్ రాయిసీడం వినోద్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా గ్రామ పెద్ద పటేల్ కిషన్ రావు చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించి నిర్మాణ పనులను అధికారికంగా ప్రారంభించారు.గ్రామ ప్రజలకు ఉపయోగపడే విధంగా రేకు షెడ్ నిర్మాణం చేపట్టడం ఆనందదాయకమని స్థానికులు తెలిపారు. ఈ షెడ్ నిర్మాణం పూర్తయితే గ్రామంలో వివిధ సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు సౌకర్యంగా ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
Reporter
వాస్తవ గమ్యం