వాస్తవ గమ్యం / తెలంగాణ / హైదరాబాదు : సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని సింగరేణి భవన్ ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, హెచ్‌ఎంఎస్ (హింద్ మజ్దూర్ సభ) కార్మిక సంఘం నేతలతో కలిసి భారీ ఎత్తున నిరసనకు దిగారు.మధ్యాహ్నం వేళ నడి ఎండను సైతం లెక్కచేయకుండా వందలాది మంది కార్యకర్తలతో కలిసి కవిత సింగరేణి భవన్ ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించారు. కార్మికులకు రావాల్సిన హక్కులు, దీర్ఘకాలిక సమస్యలపై యాజమాన్యం తక్షణమే స్పందించాలని ఈ సందర్భంగా వారు పెద్దపెట్టున నినాదాలు చేశారు. రోడ్డుపై పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు బైఠాయించడంతో లక్డీకాపూల్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. సమస్యలు పరిష్కరించే వరకు తమ పోరాటం ఆగేది లేదని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Admin
వాస్తవ గమ్యం