వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్–ఐజేయూ ఆధ్వర్యంలో తృతీయ జిల్లా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ, ప్రధాన కార్యదర్శి రామ్ నారాయణ ముఖ్య అతిథులుగా, జిల్లా కలెక్టర్ కె. హరిత ప్రత్యేక ఆహ్వానితురాలిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యలు, హక్కులు,సంక్షేమం, భద్రతపై చర్చించారు.జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, అక్రిడిటేషన్ కార్డులు, రైల్వే పాసులు, హెల్త్ కార్డులు అందించేందుకు ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నాయకులు కోరారు. జర్నలిస్టులు ప్రజాస్వామ్యానికి సమాచార వారధులుగా పనిచేస్తున్నారని కలెక్టర్ కె. హరిత పేర్కొన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తోందన్నారు. జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, భద్రత కోసం ఐజేయూ నిరంతరం కృషి చేస్తుందని నాయకులు తెలిపారు.
Reporter
వాస్తవ గమ్యం