వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి మున్సిపాలిటీ కమిషనర్ తుంగపిండి రాజలింగు జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, కమిషనర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.వక్తలు మాట్లాడుతూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ మున్సిపల్ పరిధిలో పారిశుద్ధ్యం, అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారానికి కమిషనర్ రాజలింగు కృషి చేస్తున్నారని అభినందించారు. ఆయన మంచి ఆరోగ్యం, ఆయురారోగ్యాలతో మరిన్ని సంవత్సరాలు ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Reporter
వాస్తవ గమ్యం