వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్: ఆర్టీసీ కార్మికుల హక్కులు సాధించడంతో పాటు సంక్షేమం, ఉద్యోగ భద్రత కోసం రాష్ట్ర గుర్తింపు బస్సు గుర్తుకు, స్థానిక గుర్తింపు నిచ్చెన గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఉమ్మడి ఆదిలాబాద్ రీజినల్ గౌరవ అధ్యక్షుడు కలవేన శంకర్ కార్మికులను కోరారు. ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపోలో కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో డిపో కార్యదర్శి ఎల్పుల అశోక్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు దినకర్, ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్ కార్యదర్శి సోమరాపు తిరుపతి, సీపీఐ మాజీ జిల్లా కార్యదర్శి బద్రి సత్యనారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామడుగు లక్ష్మణ్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆత్మకూరి చిరంజీవి, ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం