వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆదిలాబాద్ : తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్ నగర్ సైబర్ సిటీ అపార్ట్‌మెంట్స్ నివాసితులు ఎదుర్కొంటున్న తీవ్ర తాగునీటి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి భరోసా ఇచ్చారు. స్థానిక మాజీ కౌన్సిలర్ చిట్టి ఉమేశ్వర్ ప్రత్యేక చొరవ, సహకారంతో సైబర్ సిటీ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి సమస్యపై వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సొసైటీ ప్రతినిధులు మాట్లాడుతూ.అపార్ట్‌మెంట్స్‌లో తాగునీటి కొరత వల్ల నివాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మిషన్ భగీరథ పైప్‌లైన్ ద్వారా తాగునీటి సరఫరా అందించాలని ఎమ్మెల్యేను కోరారు. కాలనీవాసుల సమస్యలను సావధానంగా విన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.సైబర్ సిటీకి మిషన్ భగీరథ నీరు అందేలా సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని, పనులను వేగవంతం చేసి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ చిట్టి ఉమేశ్వర్, సైబర్ సిటీ అధ్యక్షుడు రాజేశ్వర్ రావు, ప్రధాన కార్యదర్శి సాయి కుమార్, నివాసితులు కృష్ణారావు, సిద్ధేశ్వర్, మారియాదాస్, శ్రీనివాస్ రెడ్డి, రవి జోగ్గు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం