Saturday, 12 September 2026 05:53:36 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు పారదర్శకంగా నిర్వహించాం.

తహసిల్దార్ సతీష్ కుమార్

Date : 08 July 2026 05:33 PM Views : 411

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి మండలంలో డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించినట్లు మండల తహసిల్దార్ పనకంటి సతీష్ కుమార్ శర్మ తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, అర్హత ప్రమాణాల ప్రకారమే లబ్ధిదారులను ఎంపిక చేసి ఇళ్లను కేటాయించినట్లు ఆయన వెల్లడించారు.రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సొంతింటి కలను సాకారం చేసే లక్ష్యంతో అమలు చేస్తున్న డబుల్ బెడ్రూం గృహ పథకం కింద సొంత ఇల్లు లేని అర్హులకే ఇళ్లను కేటాయించినట్లు తెలిపారు. కేటాయింపుల జాబితాలో ఎవరైనా అనర్హులు ఉన్నట్లు ఎవరికైనా సమాచారం ఉంటే సంబంధిత ఆధారాలతో మండల తహసిల్దార్ కార్యాలయం లేదా మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు లేదా దరఖాస్తు సమర్పించాలని సూచించారు.అందిన ఫిర్యాదులపై సమగ్ర విచారణ నిర్వహించి, అనర్హులుగా తేలిన వారి పేర్లను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. డబుల్ బెడ్రూం ఇల్లు ఇప్పిస్తామని చెప్పి కొందరు ప్రజలను మోసం చేసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించిన తహసిల్దార్, అలాంటి వ్యక్తుల మాటలను నమ్మి ఎవరికీ డబ్బులు ఇవ్వవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఇళ్ల కేటాయింపుకు సంబంధించి ఏవైనా సందేహాలు లేదా ఫిర్యాదులు ఉంటే నేరుగా మండల తహసిల్దార్ కార్యాలయం లేదా మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించాలని ఆయన సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగానే కొనసాగుతాయని తహసిల్దార్ పేర్కొన్నారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: