వాస్తవ గమ్యం / తెలంగాణ / హైదరాబాదు : జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని జర్నలిస్ట్స్ సంక్షేమ సంఘం (జేఎస్ఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కానుగంటి రాజు స్పష్టం చేశారు. హైదరాబాద్ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.వర్కింగ్ జర్నలిస్టులకు, వారి కుటుంబాలకు ఉచిత విద్య, వైద్యం అందించాలని, రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ తో పాటు పూర్తి ఉచిత ఇన్సూరెన్స్, బస్సు పాసులు, అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే రవీంద్రభారతిలో ముఖ్యమంత్రి, మంత్రుల సమక్షంలో భారీ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సంఘం నేతలు చీకట్ల శ్రీనివాస్, మానసాని కృష్ణారెడ్డి, తక్కెళ్ళపల్లి శ్రీనివాస్, కడారి బాలేశం తదితరులు పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం