Monday, 14 September 2026 10:04:26 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

మేడ్చల్‌లో తీవ్ర విషాదం.ఉన్మాది ఘాతుకానికి బలైన యువతి ఆత్మహత్య*

Date : 10 April 2026 05:06 PM Views : 173

వాస్తవ గమ్యం / తెలంగాణ / హైదరాబాదు : ​హైదరాబాద్/మేడ్చల్:ప్రేమ పేరుతో ఓ ఉన్మాది చేసిన పైశాచిక చర్య ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో ఎయిడ్స్ సోకిన రక్తాన్ని ఎక్కించి యువతి జీవితాన్ని నాశనం చేసిన ఘటనలో.ఆ వేదనను భరించలేక సదరు బాధితురాలు ప్రాణాలు వదిలింది. ​పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 11వ తేదీన ఈ దారుణం వెలుగుచూసింది.మనోహర్ అనే యువకుడు ఒక యువతిని పెళ్లి చేసుకోవాలని వేధించాడు. దానికి ఆమె నిరాకరించడంతో కక్ష పెంచుకున్న మనోహర్, అత్యంత అమానుషంగా ఆమెకు ఎయిడ్స్ పాజిటివ్ ఉన్న రక్తాన్ని బలవంతంగా ఎక్కించాడు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.నిందితుడు చేసిన పనికి శారీరకంగా, మానసిక వేదనకు గురైన ఆ యువతి, నేడు తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.బాధితురాలి ఫిర్యాదుతో గతంలోనే కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడు మనోహర్‌ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతను రిమాండ్‌లో భాగంగా జైలులో ఉన్నాడు.ఒక యువతి జీవితాన్ని చిదిమేసిన మనోహర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: