Saturday, 12 September 2026 09:58:10 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

ఫామ్ హౌస్‌కు యాక్ట్ వర్తించదా?.. తహసీల్దార్‌కు బీఎస్పీ వినతి పత్రం

Date : 07 July 2026 08:06 PM Views : 105

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి మండల తహసీల్దార్ పి. సతీష్ కుమార్‌కు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నాయకులు మంగళవారం వినతిపత్రం సమర్పించారు.మందమర్రి మున్సిపాలిటీ శివారు పరిధిలోని సీలింగ్ పట్టా భూమి సర్వే నంబర్ 347/2లో మూడు ఎకరాల 20 గుంటల విస్తీర్ణంలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే ఫామ్ హౌస్ నిర్మాణం జరుగుతోందని వారు ఆరోపించారు. 1/70 యాక్ట్ అమల్లో ఉన్నప్పటికీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వినతిపత్రంలో. పేర్కొన్నారు.అదేవిధంగా, ఆ భూమి యజమాని బూనేని రాజు (తండ్రి: భూమయ్య) సీలింగ్ పట్టా భూమిని ఇతర కమ్యూనిటీకి చెందిన వ్యక్తికి విక్రయించగా, ప్రస్తుతం ఆ వ్యక్తి ఫామ్ హౌస్ నిర్మిస్తున్నారని ఆరోపించారు.ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లయితే సీలింగ్ పట్టాను రద్దు చేసి భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని, మందమర్రి పట్టణ జర్నలిస్టులకు ఇంటి స్థలాలుగా కేటాయించాలని బీఎస్పీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీఎస్పీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడుముల్కల్లరాజేంద్రప్రసాద్, చెన్నూరు నియోజకవర్గ అధ్యక్షుడు గాజుల శంకర్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి మతిన్ ఖాన్, బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ గోమాస బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: