Saturday, 12 September 2026 04:50:04 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

పంట పొలాల్లో అక్రమ విద్యుత్ తీగలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు: మందమర్రి పోలీసులు

Date : 02 July 2026 06:06 PM Views : 95

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి,జులై 2 : పంటలను అడవి జంతువుల నుంచి రక్షించేందుకు పొలాల చుట్టూ అక్రమంగా విద్యుత్ తీగలు ఏర్పాటు చేయడం చట్టరీత్యా నేరమని మందమర్రి పోలీసులు హెచ్చరించారు. ఇటీవల కొంతమంది రైతులు కోతులు, అడవి పందులు, నీలిగాళ్లు తదితర జంతువుల నివారణ కోసం నేరుగా విద్యుత్ లైన్ల నుంచి కరెంట్ తీసుకుని పొలాల చుట్టూ తీగలు ఏర్పాటు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఈ విధంగా అక్రమంగా విద్యుత్ తీగలు ఏర్పాటు చేయడం వల్ల అమాయక ప్రజలు, పశువుల కాపరులు,వ్యవసాయ కూలీలు ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. అడవి జంతువులను నివారించేందుకు విద్యుత్ లైన్ల నుంచి నేరుగా కరెంట్ కనెక్షన్లు ఇవ్వడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. అక్రమ విద్యుత్ తీగల కారణంగా ఎవరికైనా ప్రాణనష్టం సంభవిస్తే, సంబంధిత భూ యజమాని లేదా కరెంట్ కనెక్షన్ ఏర్పాటు చేసిన వ్యక్తిపై నేరపూరిత మానవహత్య కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తామని హెచ్చరించారు.పోలీస్ శాఖ, విద్యుత్ శాఖ (ట్రాన్స్‌కో) అధికారులు సంయుక్తంగా పొలాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అక్రమ విద్యుత్ కనెక్షన్లు గుర్తిస్తే విద్యుత్ చట్టాల ప్రకారం భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా విధిస్తామని పేర్కొన్నారు. రైతులు పంటలను రక్షించేందుకు ప్రభుత్వం అనుమతించిన సోలార్ ఫెన్సింగ్ (తక్కువ వోల్టేజ్), నైలాన్ నెట్లు లేదా ఇతర సురక్షితమైన పద్ధతులను మాత్రమే వినియోగించాలని, నేరుగా విద్యుత్ తీగలను ఏర్పాటు చేయరాదని సూచించారు.అలాగే, అక్రమ విద్యుత్ కనెక్షన్లపై సమాచారం ఉన్న వారు వెంటనే మందమర్రి పోలీస్ స్టేషన్ లేదా డయల్-100కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :