వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : వాస్తవ గమ్యం :ఆగస్టు16: ఆదివారం కొమురం భీం ఆసిఫాబాద్ జైనూర్ మండలంలో కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని (KGBV) జిల్లా కలెక్టర్ కే. హరిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్‌లోని తరగతి గదులు, వంటగది మరియు పరిసరాలను స్వయంగా పరిశీలించిన కలెక్టర్, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. తనిఖీ అనంతరం కలెక్టర్ విద్యార్థులతో కలిసి అల్పాహారం స్వీకరించారు. ఆహార నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేసిన అనంతరం అధికారులకు, హాస్టల్ సిబ్బందికి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు: ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం రోజూ విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారాన్ని మాత్రమే అందించాలని స్పష్టం చేశారు. ఆహారం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు. పరిసరాల పరిశుభ్రత: హాస్టల్ ప్రాంగణంతో పాటు వంటగది, పరిశుభ్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. కెరీర్ గైడెన్స్ & సూచనలు: విద్యార్థుల భవిష్యత్తు మరియు ఉన్నత చదువులపై ప్రత్యేకంగా మాట్లాడారు. లక్ష్యాలను ఎంచుకుని, వాటిని సాధించేందుకు క్రమశిక్షణతో చదవాలని సూచించారు. పదవ తరగతి, ఇంటర్ విద్యార్థులకు కెరీర్ గైడెన్స్‌పై పలు సలహాలు, విలువైన మార్గదర్శకాలను అందించారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ ఉపాధ్యాయులు, హాస్టల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లా పౌర సంబంధాల అధికారి చే జారీ
Reporter
వాస్తవ గమ్యం