వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జన్నారం మండలం రొటీగూడ గ్రామ పంచాయతీ పరిధిలో మంగళవారం గ్రామ సర్పంచ్ జిల్లాపెల్లి గోపాల్ ఆధ్వర్యంలో రోడ్డుపైకి వచ్చిన చెట్ల కొమ్మలను తొలగించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.రోడ్డుకు ఇరువైపులా చెట్లు, పొదలు గుబురుగా పెరిగి ప్రధాన రహదారిపైకి రావడం వల్ల. వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యల్లో భాగంగా ఈ చెట్ల కొమ్మలను తొలగించినట్లు పేర్కొన్నారు.గ్రామంలోని ప్రతి సమస్యను గుర్తించి, వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించడమే తమ ప్రాథమిక బాధ్యత అని సర్పంచ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గాజుల సత్తయ్య, గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం