Tuesday, 28 July 2026 05:54:55 PM
# తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. # పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి. # చెన్నూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ పతాక దత్తత దినోత్సవం

సింగరేణి కాలరీస్ హైస్కూల్ (కల్యాణిఖని)లో ప్రవేశాలు ప్రారంభం

Date : 08 June 2026 04:10 PM Views : 492

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం కల్యాణిఖనిలోని సింగరేణి కాలరీస్ హైస్కూల్ (ఎయిడెడ్)లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను విద్యార్థుల ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. జూన్ 1, 2026 నుండి జులై 30, 2026 వరకు ఈ ప్రవేశాలు నిర్వహించనున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ జె. పురుషోత్తం ఒక ప్రకటనలో తెలిపారు. ​ఈ సందర్భంగా ఆయన పాఠశాల యొక్క ప్రత్యేకతలు మరియు సాధించిన విజయాలను వెల్లడించారు: ​ 2025-26 విద్యా సంవత్సరం పదవ తరగతి ఫలితాలలో పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఇద్దరు విద్యార్థులు 555/600 మార్కులు సాధించి పాఠశాలకు గర్వకారణంగా నిలవగా, మరో 10 మంది విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించి విశేష ప్రతిభ చాటరు అర్హత కలిగిన, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే ఇక్కడ నాణ్యమైన విద్యాబోధన అందుతోంది. డిజిటల్ తరగతి గదులు, సైన్స్ ప్రయోగశాలలు (ల్యాబ్స్) మరియు గ్రంథాలయ సౌకర్యం కలవు. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సహపాఠ్య కార్యక్రమాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఇక్కడ ప్రత్యేక శిక్షణ ఇస్తారు. క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్యతో పాటు పరిశుభ్రమైన, సురక్షితమైన మరియు విద్యార్థి-స్నేహపూర్వక వాతావరణం ఈ పాఠశాల సొంతం.కావున, తమ పిల్లలను ఈ పాఠశాలలో చేర్పించాలనుకునే ఆసక్తి గల తల్లిదండ్రులు అవసరమైన ధృవపత్రాలతో పాఠశాల కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. జూన్ 30, 2026 లోపు ప్రవేశాలను ఖరారు చేసుకోవాలని ప్రధానోపాధ్యాయులు శ్రీ జె. పురుషోత్తం సూచించారు.మరిన్ని వివరాలకు పాఠశాల ఫోన్ నంబర్ 08736-220602 లేదా ఈమెయిల్ schs_kk@scclmines.com ద్వారా సంప్రదించవచ్చు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: