Wednesday, 29 July 2026 11:43:18 PM
# ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి:

మహిళల రక్షణే ధ్యేయం,వేధింపుల రహిత సమాజమే లక్ష్యం.

మంచిర్యాల జిల్లా షి టీమ్ ఎస్‌ఐ ఉషారాణి

Date : 24 June 2026 06:49 PM Views : 165

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి, జూన్ 24: మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వేధింపుల రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా. పోలీసులు పనిచేస్తున్నారని మంచిర్యాల జిల్లా షి టీమ్ ఎస్‌ఐ ఉషారాణి తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ఐపీఎస్ (డీఐజీ) ఆదేశాలు, మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఐపీఎస్ పర్యవేక్షణలో బుధవారం మందమర్రిలోని మహిళా శక్తి భవనంలో తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) మండల సమాఖ్య ఉద్యోగులకు షి టీమ్ ఆధ్వర్యంలో మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా షి టీమ్ సిబ్బంది మహిళల భద్రత కోసం పోలీసులు తీసుకుంటున్న చర్యలు, ఈవ్ టీజింగ్, సైబర్ నేరాలు, టీ-సేఫ్ యాప్ వినియోగం, షి టీమ్ సేవలపై సమగ్ర అవగాహన కల్పించారు. మహిళలు ఎలాంటి వేధింపులకు గురైన వెంటనే రామగుండం షి టీమ్ నంబర్ 6303923700, మంచిర్యాల షి టీమ్ నంబర్ 8712659385 లేదా అత్యవసర సేవల కోసం డయల్-100కు ఫోన్ చేయాలని సూచించారు. సైబర్ నేరాల ఫిర్యాదుల కోసం 1930 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని తెలిపారు.అలాగే ఫిర్యాదు చేసిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా షి టీమ్ కానిస్టేబుళ్లు సతీష్, జ్యోతి, మందమర్రి ఏపీఎం చంద్రశేఖర్‌తో పాటు వివిధ గ్రామ సంఘాల సెర్ఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: