Tuesday, 27 October 2026 06:44:35 PM
# రాజంపేట అభివృద్ధికి ప్రత్యేక నిధులు,సిబ్బందిని కేటాయించాలి # కలెక్టరేట్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు # గుండి బ్రిడ్జిసమస్య పరిష్కారం కోసం యువత సైకిల్ యాత్ర ప్రారంభం # గుండి బ్రిడ్జి సాధనకై యువత సైకిల్ యాత్ర 20 ఏళ్ల సమస్య పరిష్కారమే లక్ష్యం # ఈ నెల 26న జిల్లాలో విద్యాసంస్థలకు స్థానిక సెలవు రెసిడెన్షియల్ పాఠశాలలకు మినహాయింపు # ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను బేషరతుగా రద్దు చేయాలి # జాఫర్‌నగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి # సెంట్రల్ లైబ్రరీలో కొమురం భీం జయంతి వేడుకలు # మంచిర్యాలలో శాంతిభద్రతలను పరిరక్షించాలి # రాళ్లవాగు బ్రిడ్జి పనులతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలి # విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఘన నివాళి # రావణ దహనానికి పటిష్ఠ పోలీసు బందోబస్తు # కిష్టంపేట గ్రామంలో భక్తిశ్రద్ధలతో మహా చండీ హోమం నిర్వహణ # ప్రమాదవశాత్తు బావిలో పడిన యువ రైతు మృతి. # భీమారం శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండీ హోమం # సద్దుల బతుకమ్మ సంబరాల్లో విషాదం.. యువతి మృతి # రామలీల కార్యక్రమానికి మంత్రి వివేక్‌కు ఆహ్వానం # ఆదిల్పేట్‌లో ఘనంగా బాల్క సుమన్ పుట్టినరోజు వేడుకలు # గిరిజన పోరాట యోధుల జయంతి ఉత్సవాలకు ఆహ్వానం # ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీ పనుల పరిశీలన

సౌర విద్యుత్‌పై అవగాహన కల్పించిన పటాన్‌చెరువు విద్యుత్ అధికారులు

Date : 02 October 2026 04:01 PM Views : 72

వాస్తవ గమ్యం / తెలంగాణ / హైదరాబాదు : గ్రీన్‌ ఇండియాలో భాగంగా సౌర విద్యుత్‌ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు పటాన్‌చెరువు విద్యుత్‌ డివిజన్‌ అధికారులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు తమ ఇళ్లపై సోలార్‌ సిస్టమ్‌లను ఏర్పాటు చేసుకుని విద్యుత్‌ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని అధికారులు సూచించారు.ఈ కార్యక్రమంలో పలు సోలార్‌ సంస్థల ప్రతినిధులను అధికారులు పాల్గొని, సోలార్‌ సిస్టమ్‌ ఏర్పాటు విధానం, ప్రభుత్వ సబ్సిడీ, నిర్వహణ, విద్యుత్‌ బిల్లులపై ప్రభావం తదితర అంశాలపై ప్రజలకు వివరించారు. కేంద్ర ప్రభుత్వ ‘ప్రధాన మంత్రి సూర్య ఘర్‌: ముఫ్త్‌ బిజ్లీ యోజన’ ద్వారా అందుబాటులో ఉన్న ప్రయోజనాలను కూడా వివరించారు.సోలార్‌ సిస్టమ్‌ ఇప్పటికే వినియోగిస్తున్న పలువురు వినియోగదారులు తమకు ఎదురవుతున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, సంబంధిత అధికారులు వాటిపై సమాధానాలు అందించారు. సాంకేతిక సమస్యలు, విద్యుత్‌ కనెక్షన్‌, నెట్‌ మీటరింగ్‌ తదితర అంశాలపై కూడా అవగాహన కల్పించారు.ఇళ్లపై సౌర విద్యుత్‌ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్‌ పొదుపుతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అధికారులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పఠాన్ చెరువు డి ఈ భాస్కర్, ఏ డి ఈ సంజయ్, రామచంద్రాపురం ఏడిఈ నాగరాజు రావు, బొల్లారం ఏ డి ఈ కళ్యాణి, ఏడిఈ ఐసిఎస్ఈ ఉమారాణి, నియోజకవర్గ పరిధిలోని ఏఈలు సబ్ ఇంజనీర్లు, ఓ ఎం స్టాప్ తో పాటు, వినియోగదారులు పాల్గొన్నారు.

V SRINIVAS

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: