వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఆర్టీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి వేణు గోపాల చారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్ ఆర్టీసీ కార్మికులను కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా అజ్మీరా శ్యామ్ నాయక్ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం అండగా నిలుస్తామని, వారి సమస్యలను ప్రభుత్వం మరియు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో బాణం గుర్తుకు ఓటు వేసి తమ అభ్యర్థిని గెలిపించాలని కార్మికులను కోరారు.ఈ కార్యక్రమంలో. కమిటీ డైరెక్టర్ వైరాగడ్ మారుతి పటేల్ జక్కన్న డీసీసీ వైస్ ప్రెసిడెంట్ తరీకి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రవీందర్ , సీనియర్ నాయకులు నిజం మండల అధ్యక్షుడు రాపర్తి మురళి టౌన్ ప్రెసిడెంట్ ఇమ్రాన్ ఎక్సెస్ సర్పంచ్ కాశయ్య సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్ డిపో కార్య కార్యదర్శి సమ్మయ్య, సంతోష్ బాబు దుర్గం దేవజీ డిపో ప్రెసిడెంట్ తనిర్ బొచ్చయ్య, డిపో సెక్రెటరీ ,జడి శంకర్, తిరుపతి ,కలింమ వెంకటయ్య, గ్యారేజ్ సిబ్బంది రాంబాబు, జోత్స్న , సులేమాన్, ఖాన్ తాళి సులేమాన్ కార్మికులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
Reporter
వాస్తవ గమ్యం