వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి,జూన్ 29 మందమర్రి పట్టణంలోని బి-1 కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన బీఎల్‌ఏ-2 సమీక్ష సమావేశంలో రాష్ట్ర కార్మిక, ఉపాధి మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, బీఎల్‌ఏ-2 ప్రతినిధులు, కార్యకర్తలు హాజరయ్యారు.సమావేశంలో బూత్ స్థాయిలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడం, బీఎల్‌ఏ-2 వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడం, ఓటరు జాబితాపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించడం, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే అంశాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, ప్రతి బూత్‌లో పార్టీని మరింత పటిష్ఠం చేయడమే లక్ష్యంగా కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేస్తూ కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Reporter
వాస్తవ గమ్యం