వాస్తవ గమ్యం / తెలంగాణ / పెద్దపల్లి : మహిళల భద్రత కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన షీ టీమ్స్ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, వేధింపులకు గురైతే మౌనంగా ఉండకుండా పోలీసులను ఆశ్రయించాలని మంచిర్యాల జిల్లా షీ టీమ్ ఎస్‌ఐ ఉషారాణి పేర్కొన్నారు.రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు, మంచిర్యాల డీసీపీ భాస్కర్ పర్యవేక్షణలో సోమవారం దండేపల్లి మండలం రెబ్బెనపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు మహిళా భద్రతపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.ఈవ్ టీజింగ్, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలు మరియు టీ-సేఫ్ యాప్ వినియోగంపై కూలీలకు అవగాహన కల్పించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని, భయపడకుండా ముందుకు రావాలని భరోసా ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల రక్షణకు పెద్దపీట వేస్తోందని, రాష్ట్రవ్యాప్తంగా పటిష్టమైన భద్రత చర్యలు చేపడుతోందని వివరించారు.వేధింపులు లేదా అత్యవసర పరిస్థితుల్లో ఈ క్రింది నంబర్లను సంప్రదించాలని కోరారు: అత్యవసర సహాయం: 100 రామగుండం షీ టీమ్ వాట్సాప్: 6303923700.మంచిర్యాల జిల్లా షీ టీమ్: 8712659385 ఈ కార్యక్రమంలో షీ టీమ్ కానిస్టేబుళ్లు సతీష్, జ్యోతి, ఫీల్డ్ అసిస్టెంట్ చిన్నయ్య మరియు పెద్ద సంఖ్యలో ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం