Sunday, 13 September 2026 07:58:33 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

ఆర్కే-న్యూ టెక్ గనిలో కార్మికుల బైఠాయింపు..

మౌలిక సదుపాయాల లేమిపై ఆగ్రహం

Date : 07 July 2026 06:22 PM Views : 119

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : శ్రీరాంపూర్: సింగరేణి శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-న్యూ టెక్ భూగర్భ గనిలో మౌలిక సదుపాయాల కొరతపై కార్మికులు మంగళవారం బైఠాయించి ఆందోళన చేపట్టారు. గనిలో పనులు నిర్వహించేందుకు అవసరమైన పనిముట్లు, మెటీరియల్స్ అందుబాటులో లేకపోవడంతో రోజువారీ పనులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భూగర్భ పనిస్థలాల్లో తగినంత గాలి ప్రసరణ లేకపోవడం, తాగునీటి సౌకర్యం లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కార్మికులు తెలిపారు. పనులు సజావుగా సాగేందుకు అవసరమైన సామగ్రిని యాజమాన్యం సమకూర్చడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. అనారోగ్యానికి గురై చికిత్స అవసరమైన సందర్భాల్లో కూడా ఆస్పత్రిలో బెడ్‌పై చేరితేనే 'సిక్ మాస్టర్' వర్తింపజేస్తున్నారని, దీంతో అనారోగ్యంతో ఉన్న కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. కార్మికుల భద్రత, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గనిలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలు. పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

BEERAM SHARATH CHANDHRA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :