వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కోటపల్లి పోలీస్ స్టేషన్ పోలీసులు పేకాట స్థావరంపై ఆకస్మిక దాడి నిర్వహించి నలుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.12,640 నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనం, 52 పేకముక్కలను స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల వివరాల ప్రకారం.జూలై 11న విశ్వసనీయ సమాచారం మేరకు కోటపల్లి ఎస్‌ఐ ఎస్. రాజశేఖర్ పోలీసు సిబ్బందితో కలిసి ఆల్గాం గ్రామ శివారులో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్గాం గ్రామంలోని ఎస్‌ఆర్‌ఆర్ ఫర్టిలైజర్ షాప్ వద్ద కొందరు డబ్బులు పందెంగా పెట్టుకొని మూడు ముక్కల పేకాట ఆడుతుండగా ఆకస్మికంగా దాడి చేశారు.పోలీసులను గమనించిన ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. సంఘటనా స్థలంలో దుర్గం రామ్‌దేవ్, గట్టు తిరుపతి గౌడ్, గారె రాజలింగు, అల్లూరి అభిషేక్‌లను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో పరారైన వ్యక్తులు గట్టు శ్రీనివాస్, రామ్‌టెంకి సునీల్‌గా గుర్తించారు. స్వతంత్ర పంచుల సమక్షంలో నిందితుల వద్ద నుంచి రూ.12,640 నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు, ఒక మోటార్‌సైకిల్, 52 పేకముక్కలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో ఎస్‌ఐ ఎస్. రాజశేఖర్‌తో పాటు హెడ్ కానిస్టేబుల్ బుజ్జిబాబు, కానిస్టేబుళ్లు శ్రావణ్, నరేష్ మరియు టీజీఎస్పీ సిబ్బంది పాల్గొన్నారు.ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ పేకాట, జూదం, మాదకద్రవ్యాలు, గుడుంబా తయారీ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని తెలిపింది. ఇటువంటి కార్యకలాపాలపై సమాచారం తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్ లేదా డయల్-112కు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వెల్లడించింది.
Reporter
వాస్తవ గమ్యం