Tuesday, 27 October 2026 05:32:17 PM
# రాజంపేట అభివృద్ధికి ప్రత్యేక నిధులు,సిబ్బందిని కేటాయించాలి # కలెక్టరేట్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు # గుండి బ్రిడ్జిసమస్య పరిష్కారం కోసం యువత సైకిల్ యాత్ర ప్రారంభం # గుండి బ్రిడ్జి సాధనకై యువత సైకిల్ యాత్ర 20 ఏళ్ల సమస్య పరిష్కారమే లక్ష్యం # ఈ నెల 26న జిల్లాలో విద్యాసంస్థలకు స్థానిక సెలవు రెసిడెన్షియల్ పాఠశాలలకు మినహాయింపు # ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను బేషరతుగా రద్దు చేయాలి # జాఫర్‌నగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి # సెంట్రల్ లైబ్రరీలో కొమురం భీం జయంతి వేడుకలు # మంచిర్యాలలో శాంతిభద్రతలను పరిరక్షించాలి # రాళ్లవాగు బ్రిడ్జి పనులతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలి # విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఘన నివాళి # రావణ దహనానికి పటిష్ఠ పోలీసు బందోబస్తు # కిష్టంపేట గ్రామంలో భక్తిశ్రద్ధలతో మహా చండీ హోమం నిర్వహణ # ప్రమాదవశాత్తు బావిలో పడిన యువ రైతు మృతి. # భీమారం శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండీ హోమం # సద్దుల బతుకమ్మ సంబరాల్లో విషాదం.. యువతి మృతి # రామలీల కార్యక్రమానికి మంత్రి వివేక్‌కు ఆహ్వానం # ఆదిల్పేట్‌లో ఘనంగా బాల్క సుమన్ పుట్టినరోజు వేడుకలు # గిరిజన పోరాట యోధుల జయంతి ఉత్సవాలకు ఆహ్వానం # ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీ పనుల పరిశీలన

ఘనంగా 6వ రాష్ట్ర స్థాయి కరాటే చాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభం

Date : 20 September 2026 06:32 PM Views : 73

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : బెల్లంపల్లి మండలం సోమగూడెంలోని త్రినేత్రి ఫంక్షన్ హాల్‌లో ఆదివారం 6వ రాష్ట్ర స్థాయి కరాటే చాంపియన్‌షిప్ పోటీలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. కుందేళ్ళ రవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రాష్ట్ర స్థాయి పోటీలకు కరాటే మాస్టర్లు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలిపి 600 మందికి పైగా హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి మందమర్రి సింగరేణి జీఎం రాధాకృష్ణ, టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి, కమిటీ అధ్యక్షులు మల్లేష్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి, రిబ్బన్ కట్ చేయడం ద్వారా అతిథులు లాంఛనంగా పోటీలను ప్రారంభించారు. ​ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ.ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా చిన్నారులకు ఆత్మరక్షణ కోసం కరాటే శిక్షణ ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ శిక్షణ వల్ల విద్యార్థులు క్రమశిక్షణ అలవరుచుకుని,చెడు వ్యసనాలకు దూరంగా ఉంటారని తెలిపారు. శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ​అదే సమయంలో క్రీడలతో పాటు విద్యకు కూడా మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కష్టపడి సాధన చేసి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో రాణించి తల్లిదండ్రులకు, శిక్షణ ఇచ్చిన గురువులకు, ఈ ప్రాంతానికి మంచి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఇంతటి ప్రతిష్టాత్మక రాష్ట్ర స్థాయి పోటీలను బెల్లంపల్లి ప్రాంతంలో విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు మాస్టర్ కుందేళ్ళ రవిని అతిథులు ప్రత్యేకంగా అభినందించారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :