Sunday, 13 September 2026 07:38:18 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

మహిళా కార్మికురాలిపై అసభ్యకర పాటల ప్రచారం దుర్మార్గం

Date : 11 May 2026 09:58 PM Views : 666

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : సింగరేణిలో పనిచేస్తున్న ఒక మహిళా కార్మికురాలిని అవమానపరుస్తూ, అసభ్యకర పదజాలంతో పాటలు రూపొందించి సోషల్ మీడియాలో ప్రచారం చేయడాన్ని ప్రగతిశీల మహిళా సంఘం,తీవ్రంగా ఖండించింది.ఈ మేరకు ప్రగతి శిల మహిళా సంఘo రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కె. జ్యోతి ఒక ప్రకటన విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.సింగరేణి వ్యాప్తంగా వేలాది మంది మహిళా కార్మికులు కష్టపడి పనిచేస్తున్నారని, పని ప్రదేశాల్లో ఇప్పటికే వారు అనేక వివక్షలు,అవమానాలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా మహిళా కార్మికురాలి వ్యక్తిత్వాన్ని హననం చేసేలా అసభ్యకర పాటలు కట్టడం, వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాల్సింది పోయి, ఇలాంటి చౌకబారు ప్రచారాలతో వారి మనోభావాలను దెబ్బతీయడం సరికాదు. సదరు మహిళా కార్మికురాలిని కించపరిచిన వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.పని ప్రదేశాల్లో మహిళలకు తగిన రక్షణ కల్పించాలని, గౌరవప్రదమైన వాతావరణం ఉండేలా చూడాలని ఆమె డిమాండ్ చేశారు. ​మహిళలను అవమానించేలా సాగుతున్న ఈ ప్రచారాన్ని తక్షణమే నిలిపివేయాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా జ్యోతి స్పష్టం చేశారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :