వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : వాంకిడి: మండలంలోని ఖమానా గ్రామానికి చెందిన లక్ష్మి తనకు ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకోగా అధికారులు రద్దు చేశారని ఆమె తెలిపింది. ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు కలెక్టర్‌ను ఆశ్రయించేందుకు వచ్చినట్లు తెలిపారు. గత 20 సంవత్సరాలుగా తాను పూరి గుడిసెలోనే నివసిస్తు న్నానని లక్ష్మి తెలిపారు. అయితే తనకు భూములు, గొర్రెలు ఉన్నాయనే కారణంతో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తును అధికా రులు రద్దు చేశారని ఆరోపించారు.తనకు సంబంధించిన వివరాలపై తప్పు సమాచారం ఆధారంగా అధికారులు నిర్ణయం తీసుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవ పరిస్థితులను పరిశీలించి తన దరఖాస్తును పునఃపరిశీలించి, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు వచ్చినట్లు లక్ష్మి తెలిపారు.
Reporter
వాస్తవ గమ్యం