Saturday, 12 September 2026 09:06:57 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

బిఆర్ఎస్వీ విద్యార్థి నాయకుల ముందస్తు అరెస్ట్

Date : 18 June 2026 12:00 PM Views : 202

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం వద్ద బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో చేపట్టదలచిన నిరసన కార్యక్రమానికి పోలీసులు ముందస్తుగానే అడ్డంకులు సృష్టించారు. ఇందులో భాగంగా చెన్నూరు నియోజకవర్గం మందమర్రి మండలానికి చెందిన పలువురు బీఆర్ఎస్వీ నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని మందమర్రి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.అరెస్ట్ అయిన వారిలో బీఆర్ఎస్వీ నాయకులు ఎండి ముస్తఫా, దాసరి నవీన్, సీపెల్లి సాగర్, మాసు వెంకటేష్, బెల్లం అరుణ్, శనిగారపు అరుణ్ తదితరులు ఉన్నరు.ఎండి ముస్తఫా పోలీస్ స్టేషన్‌లో బీఆర్ఎస్వీ నాయకుడు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తాము శాంతియుతంగా నిరసన తెలపడానికి ప్రయత్నిస్తే, అక్రమ అరెస్టులతో అణచివేయాలని చూడడం దుర్మార్గమన్నారు.23,000 ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి: ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ నిర్ణయం వల్ల పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందని, వెంటనే ఈ జీవోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న అధిక ఫీజులను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ​ప్రభుత్వ పాఠశాలలను కాపాడాలి - విద్యను అందరికీ అందుబాటులో ఉంచాలి" అనే నినాదంతో విద్యార్థుల భవిష్యత్తు కోసం, ప్రభుత్వ విద్యా వ్యవస్థ పరిరక్షణ కోసం బీఆర్ఎస్వీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. ​పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, విద్యార్థి లోకం పక్షాన తమ పోరాటం ఆగదని ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు హెచ్చరించారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: