వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రాజంపేట గ్రామపంచాయతీ పరిధిలోని కేస్లాపూర్ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లే పాత బ్రిడ్జిపై శుక్రవారం క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామపంచాయతీ సిబ్బంది ఆధ్వర్యంలో బ్రిడ్జిపై పేరుకుపోయిన మట్టిని తొలగించడంతో పాటు పెరిగిన చెట్లు, పొదలను శుభ్రం చేశారు.ఈ పనులను రాజంపేట గ్రామ సర్పంచ్ బుర్స పోచయ్య స్వయంగా పర్యవేక్షించారు. సిబ్బందితో కలిసి ముందుండి పరిశుభ్రత పనులను నిర్వహించారు. బ్రిడ్జిపై పేరుకుపోయిన మట్టిని, పెరిగిన చెట్లు, పొదలను తొలగించడం ద్వారా ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు గ్రామపంచాయతీ నిరంతరం కృషి చేస్తుందని సర్పంచ్ పేర్కొన్నారు.పరిశుభ్రమైన గ్రామం – ఆరోగ్యవంతమైన సమాజం అనే లక్ష్యంతో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
Reporter
వాస్తవ గమ్యం