వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కోల్ ఇండియా స్థాయి క్రీడా పోటీల్లో సింగరేణి ఉద్యోగ క్రీడా కారులు పతకాలు సాధించి సంస్థకు గుర్తింపు తీసుకురావాలని బెల్లంపల్లి ఏరియా జీఎం ఎం. శ్రీరమేష్ అన్నారు.శుక్రవారం గోలేటిలోని సీఈఆర్ క్లబ్‌లో నిర్వహించిన కంపెనీ స్థాయి వెయిట్‌లిఫ్టింగ్, పవర్‌లిఫ్టింగ్, బాడీబిల్డింగ్ పోటీల ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోటీల్లో కొత్తగూడెం ఏరియా రామకృష్ణ ‘మిస్టర్ సింగరేణి’గా, భూపాలపల్లి ఏరియా శ్రీనివాస్‌రెడ్డి ‘స్ట్రాంగ్‌మ్యాన్’గా, మణుగూరు ఏరియా అనిల్ ‘బెస్ట్ వెయిట్‌లిఫ్టర్’గా, భూపాలపల్లి ఏరియా అనూష ‘స్ట్రాంగ్ ఉమెన్’గా ఎంపికయ్యారు. కోల్ ఇండియాకు ఎంపికైన క్రీడాకారులను జీఎం సన్మానించగా, రిఫరీలు, నిర్వాహకులకు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో పలువురు ఏరియా అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, క్రీడా నిర్వాహకులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం