వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల: జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కరువై రోగులు, బాలింతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యేక వార్డులు ఉన్నప్పటికీ మరుగు దొడ్లలో నీటి సరఫరా లేకపోవడంతో పరిస్థితి దారుణంగా మారింది. పరిసరాల్లో అపరిశుభ్రత నెలకొని దుర్వాసన వెదజల్లుతోంది. నిత్యం వందలాది మంది రోగులు, వారి సహాయకులు వచ్చే ఆసుపత్రిలో ఈ దుస్థితిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పారిశుధ్యం, నీటి సమస్యలను పరిష్కరించాలని రోగులు కోరుతున్నారు.
Reporter
వాస్తవ గమ్యం