వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సెంట్రల్ లైబ్రరీలో కొమురం భీం జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన హక్కుల కోసం పోరా డిన వీరుడు కొమురం భీం చిత్రపటానికి పూలమాల వేసి గ్రంథాలయ సిబ్బంది,విద్యార్థులు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ రికార్డు అసిస్టెంట్ సతీదేవి, శాఖాధికారి సయ్యద్ సలీం, పార్ట్‌టైమ్ స్వీపర్ సలీంతో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొమురం భీం పోరాట స్ఫూర్తిని, ఆయన ఆశయాలను స్మరించుకున్నారు. జల్, జంగల్, జమీన్ నినాదంతో ఆదివాసీల హక్కుల సాధన కోసం కొమురం భీం చేసిన పోరాటం, ఆయన చేసిన త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆదివాసీల ఆత్మగౌరవం, హక్కుల పరిరక్షణ కోసం ఆయన సాగించిన ఉద్యమం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని గుర్తుచేశారు.కొమురం భీం ఆశయాలను ఆదర్శంగా తీసుకుని, సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
Reporter
వాస్తవ గమ్యం