Monday, 26 October 2026 03:38:06 PM
# కలెక్టరేట్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు # గుండి బ్రిడ్జిసమస్య పరిష్కారం కోసం యువత సైకిల్ యాత్ర ప్రారంభం # గుండి బ్రిడ్జి సాధనకై యువత సైకిల్ యాత్ర 20 ఏళ్ల సమస్య పరిష్కారమే లక్ష్యం # ఈ నెల 26న జిల్లాలో విద్యాసంస్థలకు స్థానిక సెలవు రెసిడెన్షియల్ పాఠశాలలకు మినహాయింపు # ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను బేషరతుగా రద్దు చేయాలి # జాఫర్‌నగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి # సెంట్రల్ లైబ్రరీలో కొమురం భీం జయంతి వేడుకలు # మంచిర్యాలలో శాంతిభద్రతలను పరిరక్షించాలి # రాళ్లవాగు బ్రిడ్జి పనులతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలి # విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఘన నివాళి # రావణ దహనానికి పటిష్ఠ పోలీసు బందోబస్తు # కిష్టంపేట గ్రామంలో భక్తిశ్రద్ధలతో మహా చండీ హోమం నిర్వహణ # ప్రమాదవశాత్తు బావిలో పడిన యువ రైతు మృతి. # భీమారం శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండీ హోమం # సద్దుల బతుకమ్మ సంబరాల్లో విషాదం.. యువతి మృతి # రామలీల కార్యక్రమానికి మంత్రి వివేక్‌కు ఆహ్వానం # ఆదిల్పేట్‌లో ఘనంగా బాల్క సుమన్ పుట్టినరోజు వేడుకలు # గిరిజన పోరాట యోధుల జయంతి ఉత్సవాలకు ఆహ్వానం # ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీ పనుల పరిశీలన # బతుకమ్మ పూలతో కళకళలాడిన ఆసిఫాబాద్ మార్కెట్

మియాపూర్ హోటల్‌లో యువతి మృతి

Date : 03 October 2026 07:28 AM Views : 173

వాస్తవ గమ్యం / తెలంగాణ / హైదరాబాదు : హైదరాబాద్: మియాపూర్‌లోని ఓ హోటల్‌లో యువతి మృతదేహం లభ్యమైన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలిని సంగారెడ్డికి చెందిన 27 ఏళ్ల కోమటి సృజనగా గుర్తించారు. ఆమె హనుమకొండలో పీజీ పీడియాట్రిక్స్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు.సెప్టెంబర్ 30న హైదరాబాద్‌కు వచ్చిన సృజన ఆ తర్వాత కనిపించకుండా పోవడంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొబైల్ లొకేషన్ ఆధారంగా ఆమె మియాపూర్‌లోని ఓ హోటల్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. హోటల్‌లోని 502వ గదిలో సృజన మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహం డీకంపోజ్ అయిన స్థితిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.ఘటనకు ముందు సృజన రవికుమార్ అనే వ్యక్తితో హోటల్‌లో ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు అనుమానిస్తున్నారు. సృజన మృతి అనంతరం రవికుమార్ హోటల్ నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. గతంలో సృజన, రవికుమార్ మధ్య ప్రేమ సంబంధం ఉన్నట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. అయితే కొన్ని కారణాలతో సుమారు ఆరు నెలలుగా సృజన అతడికి దూరంగా ఉంటున్నట్లు సమాచారం.సృజన తండ్రి ఫిర్యాదులో రవికుమార్‌పై పలు అనుమానాలు వ్యక్తం చేసినట్లు పోలీసులు తెలిపారు. గతంలో సృజనకు చెందిన బంగారు గొలుసును రవికుమార్ తీసుకున్నట్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.ఈ వ్యవహారంలో రవికుమార్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతని కోసం గాలింపు చేపట్టారు. హోటల్ సీసీ కెమెరాల ఫుటేజీ, కాల్ డేటా, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నారు. సృజన మృతికి గల కారణాలను నిర్ధారించేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు మియాపూర్ పోలీసులు తెలిపారు

V SRINIVAS

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :