Saturday, 12 September 2026 05:49:15 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

భూముల రీ సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి

జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి రాములు

Date : 15 July 2026 07:36 PM Views : 55

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : ప్రభుత్వం చేపట్టిన భూముల రీ-సర్వే ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు అధికారులను ఆదేశించారు.బుధవారం భీమారం మండలం మద్దికల్ గ్రామంలో జరుగుతున్న భూముల రీ-సర్వే పనులను మండల తహసీల్దార్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మద్దికల్ గ్రామంలో మొత్తం 853 సర్వే నంబర్లలో 4,810 ఎకరాల భూమి ఉన్నట్లు తెలిపారు. ముగ్గురు లైసెన్స్‌డ్ సర్వేయర్లు, ఒక సర్వేయర్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్, ప్రజాప్రతినిధులు, రైతుల సమక్షంలో సర్వే పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.రీ-సర్వే పనులకు రైతులు సంపూర్ణ సహకారం అందిస్తున్నారని పేర్కొన్న ఆయన, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అత్యంత పారదర్శకంగా సర్వే పూర్తి చేయాలని సూచించారు. దీంతో భవిష్యత్తులో భూ వివాదాలకు అవకాశం తగ్గడంతో పాటు, స్పష్టమైన వివరాలతో నక్షాలు సిద్ధమవుతాయని తెలిపారు.అనంతరం ఆరెపల్లి గ్రామం, భీమారం మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించి ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం పురోగతిని సమీక్షించారు. ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్ పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.తదుపరి అంకుశాపూర్ గ్రామంలోని సమతా అగ్రో ఇండస్ట్రీస్‌ను పరిశీలించిన అదనపు కలెక్టర్, మిల్లింగ్ ప్రక్రియను వేగవంతం చేసి ప్రభుత్వానికి అందించాల్సిన.సీఎంఆర్ (కస్టమ్ మిల్ల్డ్ రైస్)ను నిర్ణీత గడువులోగా సరఫరా చేయాలని రైస్ మిల్లు నిర్వాహకులకు సూచించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

KAGITHAPU SRINIVAS

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :