Tuesday, 28 July 2026 03:08:39 PM
# తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. # పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి. # చెన్నూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ పతాక దత్తత దినోత్సవం

ఆసుపత్రియా? పార్టీ హాలా? రెబ్బెన సర్కారు దవాఖానాలో సిబ్బంది నిర్వాకం!

Date : 17 June 2026 07:31 PM Views : 166

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా (రెబ్బెన)లో.పేదలకు ప్రాణం పోసే దేవాలయాలుగా వర్ధిల్లాల్సిన ప్రభుత్వ ఆసుపత్రులు.. బాధ్యతారాహిత్యానికి నిలయాలుగా మారుతున్నాయి. తాజాగా రెబ్బన మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు వైద్యం అందించే కేంద్రంలా కాకుండా, బర్త్‌డే వేడుకలు జరుపుకునే 'కేక్ కటింగ్' పాయింట్‌గా మారిపోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.ఆసుపత్రి వెలుపల రోగులు నరకయాతన అనుభవిస్తూ వైద్యం కోసం గంటల తరబడి వేచి చూస్తుంటే, లోపల ఉండాల్సిన సిబ్బంది మాత్రం బర్త్‌డే కేకుల ముందు 'బిజీబిజీ'గా గడిపారు. రోగుల ప్రాణాల కంటే తమ వ్యక్తిగత వేడుకలే ముఖ్యమన్నట్లుగా సిబ్బంది ప్రవర్తించారు. ఒకరికొకరు కేకులు తినిపించుకుంటూ, కేరింతలు కొడుతూ హుషారుగా కనిపించడం అక్కడికి వచ్చిన వారిని విస్మయానికి గురిచేసింది. అత్యవసర వైద్య సేవలు అందించే పరికరాల మధ్యే ఈ 'కేక్ కటింగ్' పండగ జరగడం సిబ్బంది నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచింది.విధి నిర్వహణలో అత్యంత బాధ్యతాయుతంగా ఉండాల్సిన వైద్య సిబ్బంది, ఇలాంటి తీపి పనులతో కాలక్షేపం చేస్తే ఇక మా ప్రాణాలకు గ్యారెంటీ ఏంటి? అని రోగులు, వారి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిని పార్టీ హాలుగా మార్చేసిన ఈ 'వైద్య' వీరులపై ఉన్నతాధికారులు ఎలాంటి 'చేదు' చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

V SAMYUKTHA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :