వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ఎమ్మెల్యే నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మంచిర్యాల, నస్పూర్ ప్రాంతాలతో పాటు హాజీపూర్ మండలానికి చెందిన 286 మంది లబ్ధిదారులకు రూ.1,05,47,100 విలువైన చెక్కులను ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.అనారోగ్య సమయంలో వైద్య ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో ఊరటనిస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.కార్యక్రమంలో మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, కార్పొరేటర్ తూముల నరేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, వైస్ చైర్మన్ జాలే రాయలింగు, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, మహిళా, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం