వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా అవగాహన కల్పించడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహించిన కరీంనగర్ హాఫ్ మారథాన్‌లో మందమర్రి రన్నర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో ఆదివారం కరీంనగర్ రన్నర్స్ అండ్ సైకిలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హాఫ్ మారథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మందమర్రి రన్నర్స్ అసోసియేషన్ సభ్యులు గుడికందుల రమేశ్, ముడారపు అనిల్ పాల్గొన్నారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన ఈ మారథాన్‌లో సుమారు 5,000 మంది రన్నర్లు పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా రమేశ్, అనిల్ మాట్లాడుతూ.నిత్యం రన్నింగ్, వ్యాయామం చేయడం ద్వారా శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండవచ్చని తెలిపారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ కనీసం 45 నిమిషాల పాటు వ్యాయామం చేయడం అలవాటుగా మార్చుకోవాలని కోరారు.మందమర్రి పట్టణ ప్రజల్లో ఫిట్‌నెస్‌పై మరింత అవగాహన కల్పించేందుకు త్వరలో మందమర్రిలో మారథాన్ నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. 3కె, 5కె, 10కె విభాగాల్లో రన్ నిర్వహించి యువతతో పాటు అన్ని వయసుల వారిని ఆరోగ్యకరమైన జీవనశైలి వైపు ప్రోత్సహించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం