వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జర్నలిస్ట్ సంక్షేమ సంఘం ట్రేడ్ యూనియన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్‌గా ‘వాస్తవ గమ్యం’ ఎడిటర్ కొమ్ము రాజేష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ సంక్షేమ సంఘం నాయకులు, ప్రతినిధులు ఆయనకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.జర్నలిజం రంగంలో తనదైన ముద్ర వేస్తూనే కార్మిక, శ్రామిక వర్గాల సంక్షేమం కోసం ముందుకు రావడం అభినందనీయమని సంఘం నాయకులు పేర్కొన్నారు. కొమ్ము రాజేష్ నాయకత్వంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జర్నలిస్ట్ సంక్షేమ సంఘం ట్రేడ్ యూనియన్ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. జర్నలిస్టులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల. పరిష్కారానికి యూనియన్ నిరంతరం కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా కొమ్ము రాజేష్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన సంఘం నాయకత్వానికి, తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో యూనియన్‌ను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తరించేందుకు, జర్నలిస్టులు, కార్మికుల హక్కుల సాధన కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.
Reporter
వాస్తవ గమ్యం