వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకుల సమావేశం నిర్వహించారు. మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకట స్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆదేశాల మేరకు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథరెడ్డి నాయకత్వంలో ఈ సమావేశం జరిగింది. రానున్న రోజుల్లో పట్టణంలోని 24 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని నాయకులు నిర్ణయించారు. మందమర్రి పట్టణ మైనార్టీ కమిటీని త్వరగా ఏర్పాటు చేయాలని మంత్రి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు ఎండీ హఫీజ్, మాజీ మైనార్టీ అధ్యక్షుడు ఎండీ జమీల్, సీనియర్ నాయకులు పాషా, ఎండీ సుకూర్, ఎండీ సజ్జు, ఎండీ చోటే మియా, ఎండీ నయూం, ఎండీ షరీఫ్, ఇసాక్, యాకూబ్, జలీల్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం